ఏపీ స్థానిక ఎన్నికలు: బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
Advertisement
- ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా విడుదల
- రెండు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీలలో పోటీకి నిర్ణయం
- అనంతపురం మేయర్ అభ్యర్థిగా కోట్ల అజేష్ బాబును ప్రకటించిన బీజేపీ
- 5 మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థుల పేర్లు ఖరారు
Advertisement
ఆంధ్రప్రదేశ్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో చర్చల అనంతరం ఈ జాబితాను ఖరారు చేసినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఎన్నికల్లో భాగంగా బీజేపీ మొత్తం రెండు నగరపాలక సంస్థలు (కార్పొరేషన్లు), ఏడు పురపాలక సంఘాల్లో (మున్సిపాలిటీల్లో) పోటీ చేయనుంది.
బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఈ వివరాలను వెల్లడించింది. తొలి జాబితాలో భాగంగా ఒక మేయర్, ఐదుగురు మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అనంతపురం కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా కోట్ల అజేశ్ బాబు పేరును పార్టీ ఖరారు చేసింది.
మున్సిపాలిటీల అభ్యర్థుల విషయానికొస్తే.. యలమంచిలి చైర్పర్సన్ అభ్యర్థిగా పిల్ల రామ కుమారి, గూడూరు (కర్నూలు) నుంచి దమ్మం సునీతా బాయి, నెల్లిమర్ల నుంచి మైపాడ ప్రసాద్, గిద్దలూరు నుంచి డాక్టర్ జాడి వెంకట నారాయణ, యర్రగుంట్ల నుంచి గోర్ల మధులత పేర్లను ప్రకటించారు.
రాజమండ్రి మేయర్ అభ్యర్థితో పాటు బాపట్ల, కావలి మున్సిపాలిటీల చైర్పర్సన్ అభ్యర్థుల పేర్లను త్వరలోనే ప్రకటిస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి. మిగిలిన స్థానాలపై కూడా చర్చలు కొనసాగుతున్నాయని, త్వరలోనే తుది నిర్ణయం వెలువడుతుందని పేర్కొన్నాయి.